అపర్ణని కావ్య మార్చేయగలదా.. అప్పుని కళ్యాణ్ కలవగలడా?
on Sep 18, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -204 లో.. కళ్యాణ్ గురించి అనామిక అలోచిస్తుంటుంది. అప్పుడే అనామిక వాళ్ళ నాన్న వచ్చి నువ్వు ఎందుకో హ్యాపీగా ఉన్నట్టున్నావ్.. కళ్యాణ్ కీ ప్రపోజ్ చెయ్యబోతున్నావా అంటూ ఎంకరేజ్ చేస్తాడు.
ఆ తర్వాత అనామిక వాళ్ళ అమ్మ వాళ్ళ మాటలు విని కూతురికి అలాగేన చెప్పేదని అనగానే.. అమ్మయి ప్రేమించేది ఎవరినో కాదు దుగ్గిరాల వారసుడిని, మన కూతురు ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుందని చెప్పగానే.. అనామిక వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక కళ్యాణ్ కి అనామిక ప్రపోజ్ చెయ్యలనుకుంటుంది. మరొకవైపు కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేసి.. నాకు రేపు పని ఉంది. కలుస్తావా మళ్ళీ హ్యాండ్ ఇస్తావా అని అడుగుతుంది. లేదు వస్తానని కళ్యాణ్ అంటాడు. మరొకవైపు అనామిక రేపు కలవాలని మెసేజ్ చేస్తుంది. దానికి కూడా కళ్యాణ్ సరే అంటాడు.
మరొక వైపు ఇంట్లో అందరు భోజనానికి సిద్ధం అవుతారు. అపర్ణ ఇంకా రావడం లేదని వెయిట్ చేస్తుంటారు. వెళ్లి తీసుకొని రావచ్చు కదా అని దాన్యలక్ష్మి అంటుంది. అబ్బో నేను వెళ్ళలేను కూరగాయలు కట్ చేసేటప్పుడు చూసావా ఎంత కోపంగా ఉందోనని రుద్రాణి అనగానే.. ఏంటి అపర్ణ కూరగాయలు కట్ చేసిందా అని ఇందిరాదేవి అంటుంది. అవును తాను వేరే వంట చేసుకుందని రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత వేరుగా అపర్ణ వండుకున్నవి తీసుకొని వచ్చి హాల్లో కూర్చొని ఉంటుంది. ఇక్కడ అంత సిద్ధం చేస్తే అక్కడ ఎందుకు కూర్చొని ఉన్నావని ఇందిరాదేవి అడుగుతుంది. నా వంట నేను చేసుకున్న ఇక వేరుగా ఉంటానని అపర్ణ అనగానే.. ఇంట్లో కోడళ్ళకి నువ్వు నేర్పించేది ఇదేనా అంటూ ఇందిరాదేవి ఆస్తి పేపర్స్ తీసుకొని వస్తుంది. వంట విషయంలో వేరుగా ఎందుకు? ఆస్తులు కూడా పంచుకొని వేరుగా ఉండండని, ఏం నిర్ణయం తీసుకుంటావో తీసుకోమని అపర్ణతో ఇందిరాదేవి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరూ తినకుండా వెళ్ళిపోతారు.
మరొక వైపు ఇందిరాదేవి దగ్గరికి రాజ్ వెళ్తాడు. అమ్మను నువ్వే మర్చాలి. ఎవరి మాట వినేలా లేదు. కావ్య తప్పు లేదు కాబట్టి తనకి సపోర్ట్ చేసానని రాజ్ అంటాడు. ఆ మాటలు కావ్య వింటుంది. నేను చేసిన పనికి ఇంత గొడవ అయింది. నేనే సాల్వ్ చెయ్యాలని కావ్య అనుకొని అపర్ణ దగ్గరికి వెళ్లి మాట్లాతుంది. అయిన అపర్ణ మాట్లాడదు. మీరు నేను చెప్పేది వినండి చాలని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.